గుంటూరు నగరంలోని సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అపహరణకు గురైన నాలుగు రోజుల పసికందుని పోలీసులు ఎట్టకేలకి కనుగొన్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ సీఐ అన్వర్ భాష నేతృత్వంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు నరసరావుపేట మండలం ఉప్పలపాడు దగ్గర పాపను ఐడెంటిఫై చేసి రికవరీ చేయడం జరిగింది. పసిపాపను బుధవారం వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.