ఏపీలో ఆహారశుద్ధి, పరిశ్రమలను జగన్ వర్చువల్గా ప్రారంభించారు. 7 ప్రాజెక్టులకు భూమిపూజతోపాటు మరో 6 ప్రాజెక్టులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంల నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ. 2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు.