ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఉత్త రాంధ్ర రీజనల్ అధికారి హేమసుందర్ తెలిపారు. అచ్యుతాపురం మండలం హరిపాలెంలో ప్రకృతి వ్యవసాయ కేంద్రాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇప్పటివరకు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేస్తున్న పొలాలు, పంటలను ఆయన పరిశీలించారు. మండల ఇన్ఛార్జి నాయుడుబాబు, సతీష్, రైతులు పాల్గొన్నారు.