సోమందేపల్లి మేజర్ పంచాయతీలోని సచివాలయం 4 పరిధిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గంగాదేవి నరసింహ మూర్తి, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, జడ్పిటిసి డిసి అశోక్ కుమార్, వైస్ సర్పంచ్ వేణుగోపాల్, మండల సచివాలయాల కన్వీనర్ షేక్ ఇమామ్ వలి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.