అక్టోబర్ చివరి తేదీ వరకు జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం గంగాధర నెల్లూరు మండలం, కోటాగారం పంచాయతీ స్థానిక ఎంపీపీ పాఠశాల కార్యాలయ ఆవరణలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతా, వైద్య సిబ్బంది వైసిపి నాయకులు సంతోష్, గోవర్ధన్ రెడ్డి , శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.