సెప్టెంబరు 19న బద్రీనాథ్‌లోని మనా గ్రామం నుండి ప్రారంభమై, సారథ్యంలో నిర్వహించిన 'శౌర్య జాగరణ్ యాత్ర' ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశమంతా సురక్షిత వాతావరణం నెలకొని ఉందని.. నేడు ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించిందని.. ఆర్థికంగా అగ్రరాజ్యం దిశగా భారత్ వేగంగా దూసుకుపోతోందని ధామి అన్నారు.