ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం నిధులను విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రికి వినతి చేసిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 01:31 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. అలాగే కృష్ణా జలాల అంశంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమిత్‌షాతో సీఎం  వైయ‌స్ జగన్‌ చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజలాల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్‌ఎల్‌పీలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు 2021 ఆగస్టు 17న, 2022 జూన్‌ 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com