కృష్ణా జలాల పునఃపంపిణీని ఆపేయాలని కోరామని, ఈ మేరకు ప్రధానికి సీఎం వైయస్ జగన్ లేఖ రాసారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కొత్తగా విధి విధానాలు రూపొందించడానికి ఒప్పుకోం. ఏపీకి రావాల్సిన ప్రతి నీటిబొట్టును తీసుకుంటామని వెల్లడించారు. అన్యాయంగా తీసుకెళ్తామంటే ఒక్క నీటిబొట్టును కూడా వదులుకోమని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసే అసత్య కథనాలకు మేం భయపడమని హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్‌పై బురదచల్లడమే లక్ష్యంగా రామోజీ, రాధాకృష్ణ పనిచేస్తున్నారు అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.