చంద్రబాబు, పవన్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన మహమ్మారి అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఉత్తర కుమారుడు లోకేష్ ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశామని చెబుతున్నాడంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ఎక్కడున్నాడు? లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడున్నాడు?. ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారు?. మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.