తీర నగరం విశాఖలో సుమారు రూ.2,300 కోట్ల వ్యయంతో భారీ ఐటీ బిజినెస్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. మధురవాడ హిల్ నెంబర్–3 మీద 18.93 ఎకరాల విస్తీర్ణంలో ఐ–స్పేస్ పేరుతో దీనిని అభివృద్ధి చేయనున్నారు. పీపీపీ విధానంలో ఈ పార్కును నెలకొల్పనుండగా.. ఇందులో ఏపీఐఐసీ 26 శాతం వాటాను, భాగస్వామ్య కంపెనీ 74 శాతం వాటాను కలిగి ఉంటుంది.