నిజాయతీగల రాజకీయ అనుభవంతో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్దే చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి నియోజకవర్గం గంటా నూకరాజు అన్నారు. వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమకేసుల కారణంగా నెలరోజులుగా రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు క్లీన్ స్వీప్ గా బయటకు రావాలని భీమిలిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ నాయకులతో కలసి గంటా నూకరాజు ఆలయ పూజలు నిర్వహించారు.