కల్తీ మద్యం తాగి కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, నాలుగేళ్లలో ఎన్నో పుస్తులు తెగాయని టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. జనాలు తాగి పడిపోవాలి.. చనిపోవాలనేది జగన్ కాన్సెప్ట్ అని విమర్శించారు. తాగుడు ద్వారా వచ్చే డబ్బులతో సంక్షేమం చేస్తున్నామని అంటారా?.. జగన్ చేసేవన్నీ వేదవ పనులని, ఇంటింటికీ డాక్టర్ పధకం ఒక బోగస్ అని, ఎంత మందికి మందులు ఇస్తున్నారు?.. ఆసుపత్రుల పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.