మడకశిర నియోజకవర్గం అగాలి మండలం ముత్తేపల్లి నుంచి సోమవారం హుళ్లి కేర ఆంజనేయస్వామి దేవాలయంవరకు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఈరన్న పాదయాత్ర చేపట్టారు. అనంతరం చంద్రబాబు ఎటువంటి మచ్చలేకుండా జైలునుండి బయటకు రావాలని పూజలు చేయించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే ఈరన్న మాట్లాడుతూ రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కొనే సత్తాలేక అక్రమ కేసులు బనాయించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.