వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని టీడీపీ జిల్లా సాంస్కృతిక విభాగం నేత గోవాడ శ్రీకాంత్ ఆదివారం అన్నారు. టీడీపీ జాతీయ అధ్య క్షుడు చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అద్దంకి నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 26వ రోజుకు చేరుకున్నాయి. సంతనూతలపాడు, కొండెపి, అద్దంకిలో రిలే దీక్షలో చెవులలో పూలు పెట్టుకొని టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు.