ఆస్ట్రేలియా ఎంపీల బృందం సోమవారం తమిళనాడు అసెంబ్లీని సందర్శించి సభా కార్యక్రమాలను వీక్షించి స్పీకర్ ఎం.అప్పావును కలిశారు. ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మిల్టన్ డిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రశ్నోత్తరాల సమయంలో హౌస్‌లోని వీఐపీ గ్యాలరీ నుండి దాదాపు 25 నిమిషాల పాటు అసెంబ్లీ కార్యక్రమాలను వీక్షించారు. సభకు వచ్చిన ప్రతినిధులను స్పీకర్ అప్పారావు ప్రకటించి స్వాగతం పలికారు. అలాగే, ఆస్ట్రేలియా ఎంపీలు అప్పారావును, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పి త్యాగ రాజన్‌ను కూడా కలిశారు.