బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులాల సర్వేలో గత వారం వెల్లడైన ఫలితాలను బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం ఆరోపించారు. సర్వే ఫలితాలు క్రమరాహిత్యాలతో నిండిపోయాయన్న బిజెపి ఆరోపణను కొట్టిపారేసిన ఏచూరి, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా కులాల గణనను ఎందుకు నిర్వహించలేకపోయిందో తెలుసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ కూడా రాష్ట్రంలో కుల ఆధారిత సర్వే నిర్వహించేందుకు ఆమోదం తెలిపాయి.