మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు వైద్య కారణాలతో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను అక్టోబర్ 18 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసును జస్టిస్ ఎఎస్ బోపన్న, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్ 18న తదుపరి విచారణకు లిస్ట్ చేసింది.జులై 21న జైన్‌కి శస్త్ర చికిత్స జరిగింది. వైద్య కారణాలతో జైన్‌కు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చారు.మే 26న, మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది, అయితే అతను మీడియాతో మాట్లాడకూడదని లేదా అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లకూడదని అనేక షరతులు విధించింది.