ఛత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా పురఈ గ్రామం నుండి తనుశ్రీ కోసరే (9) గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు దక్కించుకుంది. ఈతపై ఆసక్తితో రోజుకి 7 నుండి 8 గంటల పాటు సాధన చేస్తుంది. ఆదివారం తాను ఒకేదాటిగా 5 గంటలు చెరువులో ఈది రికార్డు సృష్టించింది. రికార్డు అందుకున్న సందర్బంగా తాను మాట్లాడుతూ నిరంతరాయంగా 12 గంటల పాటు ఈదడమే తన తదుపరి లక్షమని చెప్పింది.