ప్రభుత్వం ఈపాస్ మిషన్ల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల అక్టోబర్లో ఎండియు వాహనాల ద్వారా రేషన్ అందించేందుకు ఈపాస్ మిషన్లు పనిచేయకపోవడంతో ఎండియూ ఆపరేటర్లు చేతులెత్తేశారు. దీంతో వేలాది రేషన్ లబ్ధిదారులు బియ్యం, కందిపప్పు, పంచదార అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొన్నూరు పట్టణంలో వారం రోజుల నుంచి ఈపాస్ మిషన్లు పనిచేయటం లేదని మంగళవారం ఆపరేటర్లు తెలిపారు.