చంద్రబాబును పరామర్శించేందుకు రాజమండ్రి జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ పొత్తు విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి రెండు పార్టీల నాయకులతో ఉమ్మడి జేఏసీ వేస్తామని ప్రకటించారు. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కమిటీ వేశారు. కానీ చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాతనే టీడీపీ కమిటీ వేయాలని నిర్ణయించింది.