అక్టోబరు 11, బుధవారం అర్థరాత్రి బీహార్‌లో నార్త్ ఈస్ట్ సూపర్‌ఫాస్ట్ రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారి ధృవీకరించారు. జిల్లా యంత్రాంగం, పోలీసుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.నివేదికల ప్రకారం, రైలు ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుండి గౌహతి నగరంలోని కామాఖ్యకు వెళుతోంది. బక్సర్ జంక్షన్ నుంచి అరా వైపు రైలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మరోవైపు ఈ ఘటనతో హౌరా-న్యూఢిల్లీ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa