ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 11:07 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. గత 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.115 లక్షల కోట్లు ఉండగా రాష్ట్రంలో  జగన్ అధికారం చేపట్టిన తరువాత  చేసిన అప్పు రూ.8 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. మోదీ, జగన్‌ల పాలనంతా అప్పుల కుప్పలేనన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి ఏపీలో లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై  అప్పుభారం మోపుతున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com