పరవాడ మండలం భరణికం పంచాయతీ పరిధి బాపడుపాలెంలో కొండ చిలువ హల్ చల్ చేసింది. గురువారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో గ్రామానికి చెందిన అందుకూరి నాగేంద్ర కుమార్ ఇంటి ముందు రోడ్డుపై సుమారు 12 అడుగుల కొండ చిలువ ప్రత్యక్షమైంది.ఆవులు అరుస్తున్నాయని బయటకు వచ్చిన నాగేంద్ర కొండ చిలవను చూసి భయబ్రాంతులకు గురయ్యారు.స్నేక్ స్నాచర్ కిరణ్ కి సమాచారంఇవ్వగా కొండ చిలువను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.