ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీకి బిగ్ షాక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2023, 11:54 AM

రాష్ట్రంలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. గురువారం ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 2019లో వినోద్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతో శ్రమించానని అయినప్పటికీ తనకు గుర్తింపులేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com