హమాస్ ఉగ్రదాడుల్లో 1300 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించినట్లు హిబ్రూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా 150 మంది ఇజ్రాయెల్ ప్రజలను బంధించిందని, వారిని గాజా స్ట్రిప్ వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆ బంధీల పరిస్థితి ఏంటనే విషయంపై క్లారిటీ లేదు. కాగా, ఈ దాడుల్లో 3300 మంది గాయపడ్డారని, వీరిలో 350 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది.