రానున్న ఎన్నికల్లో మ్యానిపులేషన్‌తో గెలవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అచ్చెన్నాయుడు వాపోయారు. రాష్ట్రంలో ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లను తొలగించడం కోసం జగన్ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ఓటర్ జాబితాలో అవకతవకలపై సీఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేసారని , పర్చూరు, తిరుపతిలో ఓట్ల అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. విచారణ ముందుకు సాగడం లేదన్నారు. వలంటీర్లు ఫాం-6,7 పేర్లతో నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫాం-7 అప్లికేషన్లు దాఖలు చేసిన వారి వివరాలను జిల్లాల వారీగా ఇచ్చామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa