రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను లోకేష్ కలిశారని అచ్చెన్నాయుడు తెలియజేసారు. రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలు తనకు తెలుసని అమిత్షా చెప్పారన్నారు. లోకేష్, పురంధేశ్వరి, కిషన్ రెడ్డి కలిసి అమిత్ షాని కలవలేదని.. లోకేష్ వెళ్లేసరికే ఆ పార్టీ అధ్యక్షులు అక్కడున్నారని చెప్పారు. లోకేష్ - అమిత్ షా భేటీ వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని అన్నారు. వైజాగులో భూములను లాక్కోవడానికే జగన్ విశాఖ వస్తున్నారని అక్కడి ప్రజలకు తెలుసన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa