విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతను 'వై' కేటగిరీ నుండి 'జెడ్'కి అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు అందిస్తున్న ఆయన భద్రత బాధ్యతలు తీసుకోవాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరిందని వారు తెలిపారు. 68 ఏళ్ల జైశంకర్‌కు 'వై' కేటగిరీ భద్రత కింద ఢిల్లీ పోలీసుల సాయుధ బృందం రక్షణగా ఉంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి నివేదిక రావడంతో ఈ మేరకు ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించారు.