టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు సొంత డాక్టర్లను ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదని డాక్టర్లు చెబుతామన్నా.. వద్దని పోలీసులు ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై వాస్తవాలు చెప్పొద్దని డాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు వద్దకు ఆయన వ్యక్తిగత డాక్టర్ల బృందాన్ని పంపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిమ్సు ఆస్పత్రికి చంద్రబాబును తరలించాలన్నారు. ప్రభుత్వం మీద.. ప్రభుత్వ ఆస్పత్రుల మీద తమకు నమ్మకం లేదన్నారు. చంద్రబాబుకు స్టెరాయిడ్లిచ్చి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు.