వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులకు ఐటీ కంపెనీలు షాక్ ఇస్తున్నాయి. వారంలో మూడు రోజుల పాటు కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని ఉద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీ HCL స్పష్టం చేసింది. ఆ మూడు రోజులు ఏవనేది.. ఉద్యోగులు ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. మరోవైపు అక్టోబర్ 1 నుంచి TCS హైబ్రిడ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. ఉద్యోగులందరూ అన్ని పనిదినాల్లో కచ్చితంగా ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.