శుక్రవారం ఢిల్లీలో జరిగిన పీ-20 సమావేశంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొని పీఎంని కలిశారు. ఆ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ..... మోదీ, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది? అని ఆరా తీశారని చెప్పారు. జైలులో చంద్రబాబు ఆరోగ్యం ఎంతో క్షీణించిందని, ఆయనపై అక్రమంగా కేసులు మోపి అరెస్టు చేశారని కనకమేడల వివరించినట్లు తెలిపారు. తాను చెప్పిన విషయాలన్నీ ప్రధాన మంత్రి విన్నారని చెప్పారు.