మాజీ మంత్రి పరిటాల సునీత ఆత్మకూరు టీడీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ. చంద్రబాబు అరెస్ట్ చేశారని అందరం ఆందోళనలో ఉంటే వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల ఓట్లు తొలగించే పని చేస్తారని తెలిపారు. అదేవిదంగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు, కార్య కర్తలు ఓటర్ల జాబితా పై నిఘా ఉంచాలని కోరారు.