తమిళనాడులో ఘోర సంఘటన జరిగింది. కాంచీపురం జిల్లా మరైమలై నగర్లో రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య, నాలుగు నెలల గర్భిణి నందిని(28)ని నిప్పంటించి చంపాడు. రాజ్‌కుమార్ మద్యానికి బానిస అవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు తన భార్యకు నిప్పంటించి తన కుమారుడితో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఆమె మరణించింది. పోలీసులు రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.