పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునే వారికి వైద్యులు సూచించే పదార్థాల్లో గుడ్డు ఒకటి. అయితే ప్రపంచంలోని ఆయా దేశాల్లోని గుడ్ల ధరలను సోషల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ స్టాక్ విశ్లేషించింది. ఇండియాలో డజన్ గుడ్ల సగటు ధర రూ.79కాగా, స్విట్జర్లాండ్ రూ.560లకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. అంటే ఒక్కో గుడ్డు రూ.46లు అన్నమాట. ఇక న్యూజిలాండ్, అమెరికాలో డజన్ గుడ్లను రూ.456, రూ.359లకు విక్రయిస్తున్నట్లు తెలిపింది.