తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో పాటు శనివారం రాజమహేంద్రవరం వచ్చి చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి గోపాలపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలియజేసారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గోపాలపురం నియోజకవర్గంలో చేస్తున్న నిరసనలు, ఆందోళనలు ఆమెకు వివరించారు.