పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు ఆలయాన్ని శనివారం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అంగరంగ ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రమౌళి తెలిపారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa