ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబుకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత.... కొట్టు సత్యనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 12:12 AM

చంద్రబాబుకు ఏదైనా జరిగితే భువనేశ్వరి, లోకేశ్ లదే బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత భువనేశ్వరి, లోకేశ్ లదేనని చెప్పారు. తన కుటుంబ సభ్యులే తనపై కుట్రలు చేసి అంతం చేస్తారనే భయాలు చంద్రబాబుకు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తన కన్నతండ్రి ఎన్టీఆర్ కు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని... ఆయన చావుకు భర్త కారణమైనప్పటికీ భువనేశ్వరి స్పందించలేదని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com