మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం దేశ సాంకేతిక విజ్ఞాన రంగానికి ఎనలేని కృషి చేశారు. TNలో జన్మించిన ఆయన చిన్నతనంలో పేపర్ బాయ్ గా పనిచేశారు. కష్టపడి చదివి ఏరో స్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత పరిశోధనలపై ఆసక్తితో DRDO, ఇస్రోలో చేరారు. భారత 11వ రాష్ట్రపతిగానూ ఆయన పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ప్రతిష్టాత్మక భారత రత్న అవార్డుతో సత్కరించింది.