వరుస భూకంపాలతో అఫ్గానిస్తాన్ వణికిపోతోంది. మరోసారి వెస్ట్రన్ ఆఫ్గానిస్తాన్లోని హెరాత్ నగర సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.4గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వివరాలు ఇంకా అందలేదు. కాగా ఇటీవలే సంభవించిన భూకంపంలో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.