ఉత్తరాఖండ్ లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. 9:11 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించగా.. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 4.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. పితోర్ ఘర్ జిల్లాలోని ఈశాన్య ప్రాంతంలో దీని ప్రభావం కనిపించిందని తెలిపింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.