ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లోకి ‘ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్2` స్కూటర్ల డెలివరీని ప్రారంభించింది. ఓలా ఎస్1 ప్రో జనరేషన్ వన్ స్కూటర్‌కు అత్యాధునిక ఫీచర్లు జోడించిన ఓలా ఎలక్ట్రిక్, ఓలా జెన్ 2 స్కూటర్ ను మార్కెట్లోకి తెచ్చింది. 100 పైగా నగరాల్లో ఈ స్కూటర్ల డెలివరీ ప్రారంభం అయ్యాయని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. సింగిల్ చార్జింగ్‌తో 195 కి.మీ దూరం ప్రయాణించవచ్చు.