ఆత్మకూరు మండలం పంపనూరులో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ చేశారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ చేసి తమ మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి అక్కిరెడ్డి ఏర్పాటు చేశారు.