ఉరవకొండ పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారి మూల్ విరాట్ కు పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. వివిధ రకాల పుష్పాలతో చంద్రమౌళేశ్వరుడిని అందంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పట్టణం నుండే కాకుండా వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.