భారత్‌లో టైర్ల తయారీపై దృష్టి సారిస్తున్నట్లు జపాన్ కంపెనీ యొకొహామా తెలిపింది. ఇప్పటికే హర్యానాలో ఉన్న ప్లాంట్‌తో పాటు.. కొత్తగా విశాఖపట్నంలో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. లగ్జరీ వాహనాలకు వాడే రన్-ఫ్లాట్ టైర్ల వంటి హై-ఎండ్ టైర్ల ఉత్పత్తిని పెంచనున్నట్లు తెలిపింది. దేశంలోకి టైర్ల దిగుమతులను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని కంపెనీ పేర్కొంది.