ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన సంస్థ నుండి 19 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ కంపెనీలో లంచాలు తీసుకొని ఉద్యోగాలను అమ్ముకున్నట్లు బయటపడింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో 19మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు కంపెనీ గుర్తించింది. వారిలో 16 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించగా, ముగ్గురిని రిసోర్స్ మేనేజ్‌మెంట్ యూనిట్ నుంచి తొలగించారు. ఈ మేరకు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.