కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎంకు పరిపాలనపై అవగాహన లేదన్నారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్ళారో చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa