ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు సెప్టెంబర్ నెలలో పార్లమెంటు ఉభయసభలు, రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. అయినప్పటికీ ఈ చట్టం ప్రస్తుతం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ సుప్రీంను ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa