తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ వివరాలను ఓ వ్యాపారవేత్తకు అందజేశారని సోమవారం భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు చేశారు. దీనిపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. ‘‘లోక్‌సభ వెబ్సైట్ తన లాగిన్ వివరాలను ఎంపీ మొయిత్రా వ్యాపారవేత్త హీరానందానీ, ఆయన రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు ఇచ్చినట్లు తెలిసింది’’ అని పలు అంశాలతో లేఖలో దుబే వివరించారు.