హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ భీకర పోరు కొనసాగుతున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ రెండోసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితులపై ఆయన టెల్ అవీవ్ లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చిస్తున్న సందర్భంగా ఒక్కసారిగా యుద్ధ సైరన్ మోగింది. దీంతో భయాందోళనకు గురైన ఇరువురు భయంతో బంకర్లలో దాక్కున్నారు. దాదాపు 5 నిమిషాల పాటు వారు బంకర్లోనే ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ప్రతినిధి తెలిపారు.