చంద్రబాబు జైల్లో ఉన్నా..బయట ఉన్నా ఒక్కటేనని ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..... చంద్రబాబును చంపితే మాకు ఏం వస్తుంది? తమ్మినేని ప్రశ్నించారు.. ఆయన ఎక్కడ ఉన్న ఒక్కటే.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దేశంలోని నేరగాళ్లకి ఎలాగో చంద్రబాబుకి అలాగే అన్నారు. అతను ఆర్థిక నేరగాడు , మహాత్మా గాంధీనా, నెహ్రూ నా..? అంటూ ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. టీడీపీ పని క్లోజ్.. పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వాళ్లు ఇన్ని చేస్తున్నా సామాన్య ప్రజలలో ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు. ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరని స్పష్టం చేశారు. 16 నెలలు వైయస్ జగన్ ని జైలులో పెట్టారు.. కానీ, కేసులో ఏం నిరూపించుకాలేకపోయారని తెలిపారు.